ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్

by Disha Web Desk 2 |
ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల రాశిపై నిద్రిస్తున్న రైతు మొండయ్యపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తిమ్మాపూర్ మండలం పచ్చునూరులో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story