లాస్య పీఏపై కేసు నమోదు.. ప్రమాదానికి కారణం ఇదే!

by Ramesh Goud |
లాస్య పీఏపై కేసు నమోదు.. ప్రమాదానికి కారణం ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి ప్రధాన కారకుడుగా పీఏ ఆకాష్ ను చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు సెక్షన్ 304ఏ కింద పీఏ ఆకాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి గురి అయ్యారని కేసులో చేర్చారు. కాగా అదివేగంగా కారు నగపడం వల్లే ప్రమాదానికి గురి అయ్యిందని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలిపారు. అతివేగంగా వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీ కొట్టిందని, ప్రమాద సమయంలో లాస్య సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్లే ఉందని ఏఎస్పీ సంజీవరావు వెల్లడించారు.

Next Story

Most Viewed