- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
నగరంలో పట్టపగలే వ్యక్తి దారుణ హత్య

దిశ, హనుమకొండ, వెబ్ డెస్క్: తెలంగాణ రెండో రాజధాని అయిన వరంగల్ నగరంలోని హన్మకొండ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే సుబేదారి డీమార్ట్ ఎదురుగా ఓ వ్యక్తిని మరో వ్యక్తిపై అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపింది ఏనుగు వెంకటేశ్వర్లు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొల్లికొండ లావణ్య అనే మహిళతో రాజ్ కుమార్ అనే ఆటో డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు రాజ్ కుమార్‌తో గొడవకు దిగాడు.
దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరగడంతో వేంకటేశ్వర్లు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో రాజ్ కుమార్ దాడి చేశాడు. వెంకటేశ్వర్లు దాడిలో రాజ్ కుమార్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే నిందితుడు వేంకటేశ్వర్లు అనంతరం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. అతన్ని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని పోలీసులకు పట్టించారు. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ఎంజీఎం కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుబేదారి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.