- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
8 బీజేపీ + 8 కాంగ్రెస్ = 0 మోడల్ సక్సెస్.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: 8 బీజేపీ + 8 కాంగ్రెస్ = 0 మోడల్ సక్సెస్ అయ్యిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) ఎద్దేవా చేశారు. బడ్జెట్ (Budget)లో తెలంగాణ (Telangana)కు రావాల్సిన వాటాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ లోని కాంగ్రెస్ (Congress), బీజేపీ ఎంపీ (BJP MPs)లపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. 8 బీజేపీ ఎంపీలు + 8 కాంగ్రెస్ ఎంపీలు = తెలంగాణకు రూ. 0 అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Palamuru Rangareddy Lift Irrigation Project) (పీఆర్‌ఎల్‌ఐపీ)కి జాతీయ హోదా (National Status) నిరాకరించడం అంటే, తెలంగాణపై బీజెపీ ప్రభుత్వం(BJP Government) చూపుతున్న మరో వివక్ష (Partiality) అని వ్యాఖ్యానించారు.
అంతేగాక అన్యాయమైన బడ్జెట్ కేటాయింపులు (unfair budget allocations), ప్రాజెక్ట్ గుర్తింపుల (Project identifications), మన సంస్కృతి (culture), పండుగలను పూర్తిగా విస్మరించడం (complete neglect).. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి నిరంతర నిర్లక్ష్యానికి గురవుతున్నామని అన్నారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru, Rangareddy Project) విస్మరించడం అనేది పురాతన చరిత్రలో సరికొత్త అధ్యాయంలా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాష్ట్రం నుంచి ప్రజలు ఎనిమిది మంది ఎంపీ (eight MPs)లను ఇస్తే, ప్రతిఫలంగా పార్టీ ఏమీ ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఇక తెలంగాణకు బీజెపీ నిజమైన సహకారం.. సున్నా జవాబుదారీతనం (zero accountability), సున్నా గౌరవం (zero respect) మాత్రమేనని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ వాటా కోసం పోరాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress government) డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హాయంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా కోసం మాజీ సీఎం కేసీఆర్ (CM KCR) ఎడతెగని కృషి చేశారని తెలిపారు. అన్నింటికీ మించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ.. ఢిల్లీలో తెలంగాణ స్వరం బలంగా, స్పష్టంగా ప్రతిధ్వనించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాలని సూచించారు. ఇక ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ‘8+8 = 0 మోడల్’ల సమిష్టి వైఫల్యం అని కవిత విమర్శించారు.