- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన రిజర్వేషన్లకు 50 ఏళ్లు.. తెలంగాణలో కాంగ్రెస్ 50 రోజుల బస్సు యాత్ర
దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గిరిజనుల రిజర్వేషన్ల అమలు, అభివృద్ధి కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గిరిజనుల రిజర్వేషన్ల అమలు, అభివృద్ధి కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ చైర్మన్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం గాంధీభవన్ లో గిరిజన ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గిరిజన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్‌తో పాటు పార్టీకి చెందిన గిరిజన నాయకులు హాజరయ్యారు. అనేక అంశాలపైన సమావేశంలో నేతలు చర్చించారు.
అనంతరం మీడియాతో శంకర్ నాయక్ మాట్లాడుతూ తాము చేపట్టే బస్సు యాత్ర ద్వారా గిరిజన రిజర్వేషన్ల ప్రాముఖ్యత, గిరిజన సమాజానికి కలిగిన ప్రయోజనాలు, కాంగ్రెస్ పార్టీ గిరిజన సంక్షేమానికి చేసిన కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ బస్సుయాత్ర కొనసాగుతుందని, యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లుగా శంకర్ నాయక్ తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. గిరిజన హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్ల అమలు మరియు సంక్షేమ కార్యక్రమాల బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని శంకర్ నాయక్ తెలిపారు.






