ఆర్టీసీ జూనియర్​ అసిస్టెంట్ పరీక్షలో 406 మంది అర్హత

by Ajay Maddhiboyina |

ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ పరీక్షా ఫలితాల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని గ్రేటర్​హైదరాబాద్​జోన్​ఈడీ ప్రకటన చేశారు.

ఆర్టీసీ జూనియర్​ అసిస్టెంట్ పరీక్షలో 406 మంది అర్హత
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ పరీక్షా ఫలితాల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని గ్రేటర్​హైదరాబాద్​జోన్​ఈడీ ప్రకటన చేశారు. జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్) జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్​) పోస్టులకు అర్హత పరీక్షకు హాజరు కావడానికి అర్హులైన కండక్టర్లు, డ్రైవర్లు, రొటీన్ క్లర్క్‌ల నుండి 1 అక్టోబర్ 2024 ​దరఖాస్తులను ఆహ్వానించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్షకు హాజరయ్యే వారిలో రోటీన్​క్లర్క్ సంస్ధలో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి, డ్రైవర్లు, కండక్టర్లు కనీసం 7 సంవత్సరాలు, వీరు పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండటంతో పాటు డిపార్టుమెంట్​క్వాలిఫైయింగ్​పరీక్ష, కంప్యూటర్​స్కిల్​టెస్టులో ఉత్తీర్ణ సాధించాలనే అర్హత ప్రమాణాలు పెట్టారు. జూనియర్​అసిస్టెంట్​పరీక్షలకు 1881 దరఖాస్తు రాగా అందులో 1761 మంది పరీక్షకు హాజరైయ్యారు. అందులో హైదరాబాద్​రీజనలో​నుంచి కండక్టర్లు 785 మంది, డ్రైవర్లు 85 మంది మొత్తం 870 మంది, సికింద్రాబాద్​రీజన్​ నుంచి కండక్టర్లు 810 మంది డ్రైవర్లు 80 మంది మొత్తం 890 మంది రోటీన్​కర్క్​ఒకరు మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్​రీజనల్​కండక్టర్లు 217 మంది, డ్రైవర్లు 6, మొత్తం 223 మంది ఉత్తీర్ణత సాధించగా, సికింద్రాబాద్​రీజనల్​నుంచి కండక్టర్లు 175 మంది, డ్రైవర్లు 8 మంది మొత్తం 183 కాగా రెండు రీజనల్​పరిధిలో 406 మంది పరీక్షలో అర్హత సాధించారు.

7,8వ తరగతి చదివిన డ్రైవర్లు అర్హత సాధించారనేది అవాస్తవం:

దరఖాస్తు చేసుకున్న 1881 మంది అభ్యర్థులలో 1761 మంది హైదరాబాద్ రీజియన్ తరపున ఆర్.కె.పురంలోని దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ , వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ డిగ్రీ, పీజీ కళాశాలలో మే 15న నిర్వహించిన అర్హత పరీక్షకు హాజరయ్యారు. అందులో 406 మంది అభ్యర్థులు డిపార్ట్‌మెంటల్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 7, 8వ తరగతి చదివిన డ్రైవర్లు అర్హత సాధించారనేది సరైనది కాదని యాజమాన్యం తెలిపింది. అర్హత సాధించిన 14 మంది డ్రైవర్లలో 5 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 5 మంది గ్రాడ్యుయేట్లు, ఒకరు ఇంటర్ ఉత్తీర్ణులు, 3 మంది పదిలో ఉత్తీర్ణులయ్యారు. అర్హత పరీక్షను మే 18న హైదరాబాద్ , సికింద్రాబాద్ రీజియన్ పర్యవేక్షణలో జరిగింది. మరుసటి రోజు 19 న గ్రేటర్ హైదరాబాద్ జోన్ సీనియర్ స్కేల్​, జూనియర్ స్కేల్ అధికారులు సమాధాన కీని అందించడం ద్వారా మూల్యాంకనం నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ 20న ఫలితాలు ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులందరికీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పరీక్ష నిర్వహించబడింది. డిపార్ట్‌మెంటల్ అర్హత పరీక్షను టీజీఎస్​ఆర్టీసీ అమలులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా గోప్యంగా నిర్వహించిందిమూల్యాంకనం పారదర్శకంగా జరిగింది.

Next Story