20 శాతం వెయిటేజీ ఇవ్వండి

by Disha Web Desk 16 |
20 శాతం వెయిటేజీ ఇవ్వండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో అర్హులైన గోపాలమిత్రలకు 20 శాతం మార్కుల వెయిటేజీని కల్పించాలని ఆ సంఘం గురువారం పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాంచందర్, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో మంజువాణిని కలిసి వినతి పత్రం అందించింది. అనంతరం సంఘం అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చక్రపాణి, శివకుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 1400 మంది గోపాలమిత్రలు ఉన్నారని , వీరంతా 22 ఏండ్ల నుంచి సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరారు.


Next Story