రాష్ట్రంలో మరో 15 బీసీ డిగ్రీ కాలేజీలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 19 |
రాష్ట్రంలో మరో 15 బీసీ డిగ్రీ కాలేజీలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో 15 బీసీ డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక కొత్త జిల్లాలకు అనుగుణంగా 33 బీసీ గురుకులాలు కూడా రాబోతున్నాయి. ఈ మేరకు గురువారం ప్రిన్సిపల్​ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు ఇచ్చారు. రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, రంగారెడ్డి, జనగామ, నల్లగొండ, మహబూబ్​నగర్​, మెదక్​, నిర్మల్​లో బాయ్స్​కు, కరీంనగర్, నిజామాబాద్​, ఖమ్మం, హైదరాబాద్​, మేడ్చల్​, జనగామ, వనపర్తి జిల్లాల్లో గర్ల్స్​ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక జిల్లాకొకటి చొప్పున గురుకుల స్కూళ్లు కూడా రాబోతున్నాయి.

Next Story