బయోఫార్మా అభివృద్ధికి బీ-హబ్!

by  |
B-Hub
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని బయోఫార్మాస్యూటికల్ పరిశోధన, తయారీ ప్రోత్సాహాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీనోమ్ వ్యాలీలో బయోఫార్మాస్యూటికల్ తయారీ కేంద్రమైన బీ-హబ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. బయోఫార్మా కంపెనీలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను బీ-హబ్ పరిష్కారాలను, గణనీయమైన ప్రయోజనాలను అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా బయోఫార్మాస్యూటికల్స్ వార్షిక అమ్మకాలు 200 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 15 లక్షల కోట్లు) విలువను కలిగి ఉన్నాయి.

పరిశ్రమ ఆదాయం ఏటా 15 శాతం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. టీ-హబ్, వ్యూహబ్, టీ-వర్క్స్ తరహాలోనే బీ-హబ్ కూడా ఫార్మా, బయోటెక్ కంపెనీలకు ప్రయోజనాలు లభించనున్నాయి. బీ-హబ్ ద్వారా స్థానిక కంపెనీలకు మార్కెటింగ్, సమయాన్ని తగ్గించే సౌకర్యం, గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.



Next Story