కేఆర్ఎంబీ సమావేశానికీ రాలేం.. తేల్చిచెప్పిన తెలంగాణ

by  |
కేఆర్ఎంబీ సమావేశానికీ రాలేం.. తేల్చిచెప్పిన తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బోర్డుల మీటింగ్‌లకు రామంటూ తెలంగాణ కరాఖండిగా చెప్పుతోంది. ఆయా సమాయానుకూలంగా సాకులను చూపిస్తోంది. ఇప్పటికే గోదావరి బోర్డు మీటింగ్‌కు రామంటూ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ మురళీధర్​రావు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణా బోర్డుకు కూడా లేఖ పంపించారు. ఈ నెల 9న నిర్వహించే కృష్ణా బోర్డు మీటింగ్‌కు హాజరుకావడం కుదరదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలో విచారణ ఉందని, బోర్డు భేటీకి హాజరుకావడం సాధ్యం కాదంటూ లేఖలో పేర్కొన్నారు. నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించిన తర్వాత తదుపరి భేటీకి తేదీని ఖరారు చేయాలంటూ బోర్డుకు సూచించారు.

Next Story