- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒమిక్రాన్ అలర్ట్.. మూడో స్థానంలో తెలంగాణ

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. మహరాష్ట్ర, ఢిల్లీ తర్వాత మన రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు తేలుతున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు మహరాష్ట్ర, ఢిల్లీలో ఒక్కో రాష్ట్రంలో సుమారు 54 చొప్పున కేసులు నమోదవగా, తెలంగాణలో 24 కేసులు తేలాయి. అదే విధంగా కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్లో 14 నిర్ధారణ అయ్యాయి. కర్ణాటక, ఏపీలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులతో పాటు ప్రజలు టెన్షన్‌కు గురవుతున్నారు. పైగా కేసులు తేలుతున్న రాష్ట్రాల నుంచి మన స్టేట్‌కు రాకపోకలు సులువుగా జరుగుతున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండానే ప్రయాణికులు ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించడం గమనార్హం. కొన్ని జిల్లాల బోర్డర్లలో యాంటీజెన్టెస్టులు మాత్రమే నిర్వహించి వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి క్వారంటైన్ సూచనలు లేవు. ఇది వ్యాప్తికి దారి తీస్తుందని పబ్లిక్ హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్తగా మరో 4..
రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు తేలాయి. వీటిలో ఒకటి ప్రైమరీ కాంటాక్ట్ ఉండటం ఆందోళన కల్గించే అంశం. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24కు పెరిగింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 9,122 మంది విదేశాల నుంచి వచ్చినోళ్లకు స్క్రీనింగ్ చేయగా, 59 మందిలో కరోనా తేలింది. వీరందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఇప్పటి వరకు 24 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 13 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉన్నదని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నది. ఇదిలా ఉండగా సిటీకి చెందిన ఓ ప్రముఖ ఆసుపత్రి వైద్యుడిలో ఒమిక్రాన్ తేలినట్లు సమాచారం. ఇతర దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ బాధితుడికి ఆయన వైద్యం అందించడం వలనే వైరస్ సోకినట్లు క్షేత్రస్థాయి ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం సదరు ఆసుపత్రి స్టాఫ్ మొత్తాన్ని క్వారంటైన్చేసినట్లు సమాచారం. కానీ ఈ సమాచారాలేవి అధికారిక బులెటెన్లలో పొందుపరచకపోవడం గమనార్హం.
కరోనా అప్డేట్….
కరోనా తెలంగాణ ఇండియా
కొత్తకేసులు 172 5,326
మొత్తం 6,79,892 3,47,60,549
మృతులు 4,016 4,78,271
ఒమిక్రాన్ వేరియంట్
కొత్తకేసులు 4
మొత్తం 24
మృతులు 0