‘వరిలో సన్న రకాలు సాగు చేయండి’

by  |
‘వరిలో సన్న రకాలు సాగు చేయండి’
X

దిశ, నల్లగొండ: వరి పండించే రైతులు సన్న రకాలను సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. మూస పద్దతిలో కాకుండా పంటమార్పిడి చేస్తూ సాగు చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో శుక్రవారం నియంత్రిత పంటల సాగుపై జరిగిన అవగాహన సదస్సులో కంచర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పండించే రైతులు అధిక శాతం సన్న రకాలను మాత్రమే పండించాలని సూచించారు. నియంత్రిత సాగు ద్వారానే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రైతు పండించే పంట వివరాలను మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు.

Next Story

Most Viewed