ఎల్లుండే ఇంటర్మీడియట్ ఫలితాలు !

by  |
ఎల్లుండే ఇంటర్మీడియట్ ఫలితాలు !
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 17 న విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. పరీక్ష పత్రాల మూల్యంకనం ముగిసినప్పటికీ ఫలితాలను ఎప్పుడూ ప్రకటిస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. ఈ నెల 15న ఫలితాలను ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో జూన్ 16న ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బోర్డు తెలిపింది. ఫలితాల ప్రాసెసింగ్ పని ముగిసిందని, అయితే అన్ని రకాల ప్రక్రియలను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఫలితాల విడుదలలో ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా, గతంలో జరిగిన పొరపాట్లు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 16న ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం ఉండటంతో విద్యాశాఖ మంత్రి కూడా అందులో పాల్గొననున్నారు. ఇంటర్ ఫలితాలపై కూడా కేబినేట్ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ఆలస్యమైతే ఫలితాల విడుదలపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఫలితాలను విడుదల చేసే అవకాశమున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed