బ్రేకింగ్.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

by  |
Results12
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ విద్యాశాఖ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ పస్టియర్ పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో సుమారు 4.59 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. నేడు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.in, manabadi.com, www.schools9.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్లను సంప్రదించండి.

ఉత్తీర్ణత పొందిన వారిలో బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉన్నారు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2.24 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Next Story