రేపే హోలీ.. తెలంగాణ సర్కార్ కఠిన ఆదేశాలు..

by  |
రేపే హోలీ.. తెలంగాణ సర్కార్ కఠిన ఆదేశాలు..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హోలీ, ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే వేడుకలపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపింది. ర్యాలీలు, యాత్రలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

Next Story