గ్రామ పంచాయతీలకు శుభవార్త.. నిధులు విడుదల

by  |
గ్రామ పంచాయతీలకు శుభవార్త.. నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిధుల కోసం అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, స్టేట్​ మ్యాచింగ్ ​గ్రాంట్స్​ నుంచి రూ. 432 కోట్లను ఇస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పల్లె ప్రగతి కింద నిధులు ఇవ్వగా.. ఈసారి మాత్రం స్పెషల్ ఫండ్స్‌గా ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.432 కోట్ల నిధులు శనివారం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు కాగా, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed