ఎంసెట్ వాయిదా?.. మళ్లీ అప్పుడే?

by  |
ఎంసెట్ వాయిదా?.. మళ్లీ అప్పుడే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎంసెట్ వాయిదా పడే అవకాశాలున్నాయి. దీనికి కారణం కరోనా నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను వాయిదా వేయడమే. సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో టెన్త్, ఇంటర్ ఫస్టియ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేసింది. కరోనా ఉధ్ధృతి తగ్గిన తర్వాత ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహిస్తామంది.

జులైలో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనిని బట్టి చూస్తే… జులై 15 తర్వాత ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించి ఆగస్టులో ఫలితాలను వెల్లడించే అవకాశముంది.

దీంతో ఆగస్టులో ఎంసెట్ నిర్వహించే అవకాశముంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 5 నుంచి 9 మధ్య ఎంసెట్ జరగాల్సి ఉంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగకుండా ఎంసెట్ నిర్వహించడం సరికాదనే భావనకు అధికారులు వచ్చారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు పూర్తైన తర్వాతే ఎంసెట్ నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed