విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం

by  |
bonalu
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి భాగ్యనగర్ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ బోనం సమర్పించారు. గత 12 ఏళ్లుగా దుర్గమ్మకు ఆనవాయితీగా తెలంగాణ బోనం సమర్పిస్తోన్న విషయం తెలిసిందే. ఆషాడమాసం బోనాల జాతర నేపథ్యంతో పట్టువస్త్రాలు సమర్పించి, జమ్మిదొడ్డి దగ్గర భాగ్యనగర్‌, మహంకాళి బోనాల జాతర ఉమ్మడి ఊరేగింపు కమిటీ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ నుంచి కళాకారుల నృత్యాలు, డప్పు, వాయిద్యాలతో కొండమీదకు బోనాన్ని ఊరేగించనున్నారు.


Next Story