పది లక్షల మందితో ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’

by  |
పది లక్షల మందితో ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ సిద్ధమవుతున్నది. నగరంలో పది లక్షల మందితో ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీపావళి పండుగ తర్వాత తేదీని ఖరారు చేయనున్నది. ఇప్పటికే దీని నిర్వహణపై అన్ని జిల్లాల బీజేపీ నేతలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చర్చలు జరిపారు. పదాధికారులతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని చర్చించారు. మొదటి పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ దీపావళి పండుగ లోపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు.

కానీ ఇప్పటివరకూ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, యువత, విద్యార్థులను అన్ని జిల్లాల నుంచి సమీకరించి నగరంలోనే ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’ నిర్వహించాలని భావిస్తున్నారు. మిలియన్ మార్చ్ నిర్వహణపై అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి అనుమతి వచ్చి వెంటనే మొదలుపెట్టనున్నారు.

Next Story

Most Viewed