హాట్ కేక్‌లా.. టెగా ఇండస్ట్రీస్ ipo

104

దిశ, వెబ్‌డెస్క్: మైనింగ్, బల్క్ సాలిడ్స్ హ్యాండ్లింగ్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకమైన పరికరాలను తయారు చేసే Tega ఇండస్ట్రీస్ డిసెంబర్ 1న పబ్లిక్ ఇష్యూని ప్రారంభించింది. కంపెనీ ఒక్కో ఈక్వీటి షేరు కు రూ.443 నుంచి రూ.453గా నిర్ణయించింది. ఈ ipo ద్వారా Tega Industries రూ.619 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్ కనీసం ఒక లాట్ (33) షేర్లకు గరిష్టంగా 13 లాట్‌‌ల వరకు బిడ్లు వేయవచ్చు. ఒక లాట్ షేరు ధర రూ.14,949 అవుతుంది. ఈ ipo డిసెంబర్ 3న ముగుస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 2020లో ఆదాయాల పరంగా పాలిమర్-ఆధారిత మిల్లు లైనర్‌ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం గ్రే మార్కెట్‌లో టెగా ఇండస్ట్రీస్ స్టాక్ ఒక్కో షేరుకు రూ.385 ప్రీమియంతో కోట్ చేస్తుంది. ఈ కంపెనీకి గుజరాత్‌లోని దహేజ్‌, పశ్చిమ బెంగాల్‌లోని సమాలిలో తయారీ సైట్‌లు ఉన్నాయి. చిలీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలోని ప్రధాన మైనింగ్ హబ్‌లలో మూడు సైట్‌లు ఉండటం విశేషం.