హై ఎండ్ ఫీచర్స్‌ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6,299కే

195
techno

దిశ, వెబ్‌డెస్క్: టెక్నో తన తాజా స్మార్ట్‌ఫోన్ Tecno Pop 5 LT ని పాప్ సిరీస్ కింద బుధవారం భారతదేశంలో విడుదల చేసింది. సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండే ధరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ‘టెక్నో పాప్ 5 ఎల్‌టి ఫోన్ ఇంతకుముందు ఫిలిప్పీన్స్‌లో విడుదల అయింది. స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 14 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. 6.52-అంగుళాల HD+ IPS LCD (720×1,560 పిక్సెల్‌లు) డాట్ నాచ్ డిస్‌ప్లేను 480 నిట్స్ బ్రైట్‌నెస్‌‌ను కలిగి ఉంది. Android 11 Go-ఆధారిత HiOS 7.6తో నడుస్తుంది. వెనుక భాగంలో 8MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. వాటర్ రెసిస్టన్స్ కోసం ఫోన్ IPX2 రేటింగ్‌ను కలిగి ఉంది. HiOS 7.6 వాల్ట్ 2.0, స్మార్ట్ ప్యానెల్ 2.0, కిడ్స్ మోడ్, సోషల్, టర్బో, డార్క్ థీమ్‌లు, పేరెంటల్ కంట్రోల్, డిజిటల్ వెల్బీయింగ్, జెస్చర్ కాల్ పిక్కర్, ఇతర వంటి స్థానికీకరించిన ఫీచర్‌లతో వస్తుంది. Tecno Pop 5 LTE 2GB RAM 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,299. జనవరి 16 నుండి అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ విక్రయానికి సిద్ధంగా ఉంది. Tecno ఫోన్ డీప్సీ లస్టర్, ఐస్ బ్లూ టర్కోయిస్ సియాన్ అనే మూడు కలర్స్‌లో లభిస్తుంది.

techno22