ప్రపంచవ్యాప్తంగా భారీగా వీడియోలను తొలగించిన YouTube.. ఎన్నో తెలుసా!

by Disha Web Desk 17 |
ప్రపంచవ్యాప్తంగా భారీగా వీడియోలను తొలగించిన YouTube.. ఎన్నో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆధరణ కలిగినటువంటి వీడియో ఫ్లాట్‌ఫారమ్ YouTube '56 లక్షల వీడియోలను' తొలగించింది. సంస్థకు చెందిన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2022 జూలై-సెప్టెంబర్ నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో వీడియోలను తన ఫ్లాట్‌ఫారమ్ నుండి తీసివేసినట్టు కంపెనీ ప్రకటించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు కంటెంట్‌ను తొలగించారు.

రెండు నెలల్లో దాదాపు 2,71,000 తొలగింపు ఫిర్యాదులు వచ్చాయి. సమీక్షించిన తర్వాత వాటిలో 29,000 అప్పీళ్లను పునరుద్ధరించారు. ముఖ్యంగా పిల్లల భద్రత, అశ్లీలత, హానికరమైన కంటెంట్‌ వీడియోలను డిలేట్ చేశారు. ప్లాట్‌ఫారమ్‌కు హాని కలిగించే కంటెంట్‌ను అనమతించేది లేదని, అలాగే, దీనికోసం సంబంధిత నిపుణులతో పనిచేస్తున్నట్లు YouTube తెలిపింది.


Next Story

Most Viewed