భారీ ఫీచర్లతో వస్తున్న Xiaomi 13 అల్ట్రా స్మార్ట్‌ఫోన్

by Harish |   ( Updated:2023-04-13 10:54:17.0  )
భారీ ఫీచర్లతో వస్తున్న Xiaomi 13 అల్ట్రా స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Xiaomi కొత్త మోడల్ Xiaomi 13 అల్ట్రాను ఏప్రిల్ 18న జరగబోయే ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. ఇది చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని ఫీచర్ల గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికి కొన్ని అంచనాలు మాత్రం బయటకు వచ్చాయి.


దీని ప్రకారం, Xiaomi 13 అల్ట్రాలో బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా 50MP+50MP+50MP+50MP కెమెరాలు ఉండవచ్చు. అలాగే సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉండనుంది. 6.7-అంగుళాల QHD+ LPTO E6 AMOLED ప్యానెల్‌, Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 4,900mAh బ్యాటరీకి 90W చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. దీనిలో 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది. 16GB వరకు RAM 512GB స్టోరేజ్ మెమరీతో రానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: పని చేసి చేసి అలసిపోయి పడిపోయిన రోబో.. వైరల్ అవుతున్న వీడియో



Advertisement

Next Story

Most Viewed