భారత మార్కెట్లోకి Xiaomi టాబ్లెట్.. లాంచ్ తేదీ ఇదే!

by Disha Web Desk 17 |
భారత మార్కెట్లోకి Xiaomi టాబ్లెట్.. లాంచ్ తేదీ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: Xiaomi కంపెనీ నుంచి కొత్తగా టాబ్లెట్ విడుదల కానుంది. దీని పేరు ‘Xiaomi Pad 6’. గతంలో చైనాలో లాంచ్ అయిన టాబ్లెట్ ఇప్పుడు భారత్‌లోకి అడుగుపెట్టనుంది. అధికారిక సమాచారం ప్రకారం, ఇది జూన్ 13న ఇండియాలోకి అడుగుపెట్టనుంది. Pad 6 స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది Android 13 ఆధారంగా MIUI 14పై నడుస్తుంది. 11-అంగుళాల 2.8K (1,800x2,880 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌ కలిగి ఉంది. దీనిలో 12GB RAM, 256GB వరకు UFS3 స్టోరేజ్‌ని అందించారు. కెమెరాల పరంగా బ్యాక్‌సైడ్ 13-మెగాపిక్సెల్ సెన్సార్, ముందు 8-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. టాబ్లెట్ 8,840mAh బ్యాటరీతో 33W చార్జింగ్‌ను కలిగి ఉంది.


Next Story

Most Viewed