డిస్కౌంట్ ఆఫర్‌తో రేపే అందుబాటులోకి Xiaomi కొత్త ట్యాబ్

by Disha Web Desk 17 |
డిస్కౌంట్ ఆఫర్‌తో రేపే అందుబాటులోకి Xiaomi కొత్త ట్యాబ్
X

దిశ, వెబ్‌డెస్క్: Xiaomi కంపెనీ నుంచి కొత్ ట్యాబ్లెట్ ‘Pad 5’ జూన్ 13న లాంచ్ కానుంది. లాంచ్ సందర్భంగా ఇది రూ. 1000 తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ 6GB + 128GB RAM స్టోరేజ్ ధర రూ. 26,999. కానీ రూ. 1000 తగ్గింపుతో రూ. 25,999కే లభిస్తుంది. కంపెనీ అధికారిక స్టోర్లు, ఆన్‌లైన్ ద్వారా కొనుగోలకు అందుబాటులో ఉంటుంది. ICICI క్రెడిట్ కార్డు ద్వారా రూ. 2,000 తగ్గింపు కూడా లభిస్తుంది.

Xiaomi ప్యాడ్ 5 స్పెసిఫికేషన్స్

* 10.95-అంగుళాల 2.5K+ డిస్‌ప్లే,120Hz రిఫ్రెష్ రేట్‌.

* ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 SoC ద్వారా పనిచేస్తుంది.

* 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

* ఆండ్రాయిడ్ 12 పై MIUI 13 తో రన్ అవుతుంది.

* ఇది డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో పాటు క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంది.

* 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 8,720mAh బ్యాటరీని కలిగి ఉంది.


ఇవి కూడా చదవండి:

ఎడ్జ్ బ్రౌజర్‌లో ‘వాయిస్ చాట్’ ఫీచర్‌ను తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్


Next Story

Most Viewed