పదేళ్ల తర్వాత సరికొత్త హంగులతో Wikipedia

by Disha Web |
పదేళ్ల తర్వాత సరికొత్త హంగులతో Wikipedia
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయమున్న ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా సైట్ Wikipedia(వికీపీడియా) ఇప్పుడు సరికొత్తగా లేటెస్ట్ అప్‌డేట్‌లతో వినియోగదారులకు బ్రౌజింగ్‌ను సులభతరం చేసే విధంగా రానుంది. వికీపీడియా (డెస్క్‌టాప్ వెర్షన్)కి కొత్త రూపాన్ని ఇవ్వనున్నారు. సందర్శకులు మరింత సులభంగా వికీపీడియా నుంచి సమాచారాన్ని పొందడానికి డెస్క్‌టాప్ వెర్షన్‌లో కొత్తగా అప్‌డేట్‌లను అందించనున్నట్లు వికీపీడియా యాజమాన్యం తెలిపింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సైట్‌లో మార్పులు చేయనున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫొటోలు, కంటెంట్ స్టైల్‌లో ఈ మార్పులు ఉండనున్నాయి.

కొత్తగా ఆన్‌లైన్‌లోకి వస్తున్న వారితో పాటు, తర్వాత తరం పాఠకుల అవసరాలను తీర్చేందుకు వికీపీడియాలో మార్పులను ప్రవేశపెట్టినట్లు ఫౌండేషన్ తెలిపింది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 కంటే ఎక్కువ వివిధ రకాల వాలంటీర్‌ గ్రూపులతో సంప్రదింపులు జరిపి దీనిని రూపొందించారు. వికీపీడియాను జనవరి 15, 2001 న ప్రారంభించారు. ఇది ప్రస్తుతం 310 కు పైగా భాషల్లో సేవలు అందిస్తుంది.


Next Story