Whats APP : ఇక నుంచి అలా కుదరదు..

by Disha Web Desk 4 |
Whats APP : ఇక నుంచి అలా కుదరదు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేక్ మెసేజ్‌లు, తప్పుడు వార్తలను నియంత్రించేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా యాప్ లో పలు మార్పులు చేస్తుంది. తప్పుడు వార్తల కట్టడికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు ఫీచర్లను తొలగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా వాట్సప్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ లకు కళ్లెం వేసింది. ఇక నుంచి ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడానికి వీలు కాకుండా కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఒకవేళ ఫార్వర్డ్ చేయాలనుకుంటే మళ్లీ మెసేజ్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అయితే త్వరలో అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ నిబంధనను తీసుకురానున్నారు.



Next Story

Most Viewed