ఇక చాట్ జీపీటీదే హవానా...? త్వరలో గూగుల్ బందైపోతుందా..?

by Dishanational1 |
ఇక చాట్ జీపీటీదే హవానా...? త్వరలో గూగుల్ బందైపోతుందా..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. త్వరలో గూగుల్ బందైపోతుందా? అని. దానికి కారణం చాట్ జీపీటీ అని. అది నిజమేనా..?. సో అదేంటో ఓసారి చూద్దాం. చాట్ జీపీటీ వచ్చిన 5 రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది. 5 మిలియన్స్ వ్యూస్ ను క్రాస్ చేసింది. దీంతో ప్రముఖ సంస్థ అయిన గూగుల్ కూడా చాట్ జీపీటీని చూసి భయపడింది. ఇది గూగుల్ రీసెర్చ్ ఇంజిన్ ను కూడా రీప్లేస్ చేయొచ్చు అనే టాక్ కూడా భారీగా వినిపిస్తోంది. ఈ చాట్ జీపీటీ గురించి మాట్లాడితే.. మనం ఏదైనా సాధారణ చాట్ బాట్ లో ఏదైనా క్వశ్చన్ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. ఒక మనిషి మనతో మాట్లాడినట్లుగా ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. దీని మాదిరి లాంటిదే చాట్ జీపీటీ. జనరేటీవ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్(జీపీటీ). దీనికి, గూగుల్ కు మధ్య తేడా ఏంటి.. ఇది అసలు గూగుల్ ను ఎందుకు భయపెడుతోంది అంటే.. మనకు ఏదైనా సమాచారం కావాలన్నప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్లి టైప్ చేస్తాం.. వెంటనే దానికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్ గా గూగుల్ లో లభ్యమవుతుంది. సాధారణంగా చాలా ఎక్కువమంది ప్రతి సమాచారానికి గూగుల్ పైన ఎక్కువగా ఆధారపడుతుంటారు.

అయితే, చాట్ జీపీటీలో కూడా మనకు ఏదైనా సమాచారం కావాలన్నప్పుడు ఆన్సర్ వస్తుంది. కానీ, ఎలాంటి లింక్స్ రావు. ఆన్సర్ మాత్రమే వస్తుంది. ఆ ఆన్సర్ కూడా ఒక చోటు క్లూప్తంగా కుదించి, వివరణాత్మకంగా వస్తుంది. ఓ వ్యక్తి ఏదైనా క్వశ్చన్ కు ఆన్సర్ రాస్తే ఎంత పద్ధతిగా ఉంటదో.. అంతే పద్ధతిగా చాట్ జీపీటీలో ఆన్సర్ వస్తది. దీంతో చాలా ఎక్కువమంది దీనిపైనే ఆధారపడే అవకాశం కనబడుతుందంటా. అంతేకాదు.. ఏదైనా ఒక క్రిటికల్ మ్యాథ్స్ క్వశ్చన్ టైప్ చేస్తే వెంటనే ఒక పద్ధతిలో చాలా ఈజీగా వెంటనే ఆన్సర్ వస్తదంటా. దీనిలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్... ఇలా అన్నీ కూడా యాడ్ చేశారంటా. మొత్తంగా కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ దీని న్యూ కాన్సెప్ట్. ప్రస్తుతం చాట్ జీపీటీ-3.5 వర్షన్ నడుస్తోందంటా. ఇది ఇంకా ట్రయల్ స్టేజీలోనే ఉంది. ఈ చాట్ జీపీటీ ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవడమే కాకుండా అది చేసిన తప్పులను కూడా సవరించుకుంటూ సరైనా సమాచారాన్ని మనకు అందిస్తదంటా. ఇంకోటి ముఖ్యమైన విషయమేమంటే...అది ఆన్సర్ చెప్పేటప్పుడు ఇంటర్నెట్ వాడదంటా.

చాట్ జీపీటీ అనే ఈ స్టార్టప్ లో మైక్రోసాఫ్ట్, ఇలాన్ మస్క్, స్యామ్ ఆల్ట్ మెన్.. పెట్టుబడులు పెట్టారంటా. వీళ్లందరూ కలిసి దీనిని తయారు చేశారంటా. ఇందులో 300 బిలియన్స్ వర్డ్స్ తో కూడిన డేటా అందులోబాటులో ఉంటుందంటా. మనకు ఏ డౌట్ ఉన్నా కూడా అది క్షణాల్లో మనకు కావాల్సిన సమాచారం అందిస్తదంటా. అయితే, అది మొదటగా ఫ్రీగా సమాచారాన్ని మనకు అందించినా, ఆ తర్వాత క్రమంగా చార్జ్ చేసే అవకాశముందంటా. అంతేకాదు.. ఎక్కువ మొత్తంలో చార్జ్ చేసే అవకాశం లేకపోలేదంటా. అంతేకాదు.. భవిష్యత్తులో ఇమేజ్ రూపంలో రాబోతుందంటా. దాని పేరే డాలీ అంటా. ఒకవేళ మనం ఏదైనా బైక్ చూపించమని దానిని అడిగితే.. ఆ బైక్ ను గీసి మనకు చూపిస్తదంటా. అది కూడా క్షణాల్లోనే. ఈ నేపథ్యంలో మరో రెండుమూడు సంవత్సరాలకు ఇక గూగుల్ ఉండదేమోనని అనే జనం చర్చించుకుంటున్నారంటా. మొత్తంగా చాట్ జీపీటీ అనేది కొత్త విప్లవం సృష్టించే అవకాశముందంటా.

ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరంగా చిల్ర్డన్స్


Next Story

Most Viewed