'మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్'.. గ్యాస్ లీకేజ్‌ను కూడా చూడొచ్చు!

by Disha Web Desk 22 |
మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్.. గ్యాస్ లీకేజ్‌ను కూడా చూడొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ చుట్టుపక్కల గల అదృశ్య వస్తువులను చూసేందుకు యూజర్లను అనుమతించనుంది. ఈ కొత్త పేటెంట్ అప్లికేషన్ ద్వారా గ్యాస్ లీకేజ్‌ను కూడా చూడొచ్చని తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం.. భవిష్యత్తులో ఈ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్స్‌ను 'మౌంటబుల్ సిస్టమ్స్, ప్రొజెక్షన్-బేస్డ్ సిస్టమ్స్, హెడ్స్-అప్ డిస్‌ప్లేస్, వెహికల్ విండ్‌షీల్డ్స్ లేదా కాంటాక్ట్ లెన్స్‌లు, హెడ్‌ఫోన్స్ లేదా హ్యాండ్‌హెల్డ్ డివైస్‌ల ద్వారా కూడా అప్లయ్ చేయొచ్చని యాపిల్ స్పష్టం చేసింది.

XR సిస్టమ్.. భౌతిక వాతావరణంలో నాన్ విజిబుల్ ఫీచర్స్‌కు వర్చువల్‌ రిప్రెజెంటేషన్‌ను ప్రదర్శిస్తుంది. తద్వారా ఈ సిస్టమ్ యూజర్ భౌతిక వాతావరణంలో కనిపించని లక్షణాలను చూడొచ్చు. ఇవి Wi-Fi వంటి విద్యుదయస్కాంత సంకేతాలు కావచ్చు లేదంటే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుంచి గాలి ప్రవాహం, వస్తువుల ఉష్ణోగ్రత, ద్రవాలు లేదా వాయువులు లేదా సంగీత వాయిద్యం ద్వారా వెలువడే శబ్దాలు కూడా కావచ్చు. హెడ్-మౌంటెడ్ డిస్‌ప్లే లేదా హెడ్‌సెట్ అనేది కనిపించని దృగ్విషయాన్ని(ప్రత్యేక సెన్సార్స్ ఉపయోగించి) గుర్తించినప్పుడు.. ఆ గ్యాస్ ఎంత హానికరమో లేదా ధ్వని తరంగం ఎలా ప్రయాణిస్తుందో విజువల్ రిప్రెంజెటేషన్‌‌తో చూసేందుకు సదరు పరికరం యూజర్‌ను అనుమతిస్తుంది.

మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. వాయిద్యం నుంచి ఉద్భవించే తరంగాలు డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ఇది AR వ్యాప్తిని అతిగా సృష్టించడం ద్వారా మూసిఉన్న అల్మారా తలుపుల వెనుక చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాదు అల్మారాను అంతకుముందు తెరిచిన సమయంలో రికార్డ్ చేసిన వీడియో.. యూజర్ ప్రస్తుత ఎక్స్‌పీరియన్స్‌తో సరిపోలడం విశేషం. ఇక ఈ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ 2023 నాటికి మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం మూడు కొత్త హెడ్‌సెట్స్‌పై పనిచేస్తున్న యాపిల్.. 2023లో రిలీజయ్యే హెడ్‌సెట్‌కు 'యాపిల్ రియాలిటీ ప్రో'గా నామకరణం చేసినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక అన్నీ ఆన్‌లైన్‌లోనే


Next Story

Most Viewed