ఏపీ, తెలంగాణలో 'వి' గిగానెట్.. వేగవంతమైన స్పీడ్‌తో అత్యున్నత నెట్‌వర్క్‌

by Dishanational4 |
ఏపీ, తెలంగాణలో వి గిగానెట్.. వేగవంతమైన స్పీడ్‌తో అత్యున్నత నెట్‌వర్క్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణాలలో 11వేల ప్రాంతాలలో ఎల్‌ 1800ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 'వి' గిగానెట్‌ ఇప్పుడు రెండు రెట్లు వేగవంతం నెట్‌వర్క్‌ బలోపేతం చేస్తోంది. 'వి' ప్రారంభించిన కార్యక్రమాలు వినియోగదారులు మెరుగైన డెటా అనుభవాలను పొందడంతో పాటుగా విస్తృత స్ధాయి ఓటీటీ కంటెంట్‌, హంగామా మ్యూజిక్‌, 'వి' యాప్‌పై గేమింగ్‌ పొందగలరు. సుప్రసిద్ధ టెలికామ్‌ సేవల ప్రదాత, 'వి' తమ నెట్‌వర్క్‌‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని వినియోగదారులకు మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను వేగవంతమైన స్పీడ్స్‌ కోసం ప్రారంభించింది.

'వి' ఇప్పుడు అదనపు 1800 మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ను తమ 11 వేల సైట్స్‌ వద్ద ఈ రెండు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా మరింత వేగవంతమైన డౌన్‌ లోడ్స్‌, అప్‌లోడ్స్‌, స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.గత సంవత్సర కాలంలో అదనంగా 660 నూతన సైట్లను 'వి' జోడించడంతో పాటుగా 6201 సైట్లలో అదనపు సామర్ధ్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సామర్థ్యం పెంపు వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు వెల్లడించేందుకు ప్రత్యేకంగా ప్రచారాన్ని సైతం 'వి' ప్రారంభించింది.

ఈ ప్రచారం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులు వి గిగానెట్‌ పై రెండు రెట్ల వేగం అనుభవించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమం గురించి వోడాఫోన్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్దార్థ జైన్‌ మాట్లాడుతూ.. 'మా ప్రస్తుత ప్రచారానికి అనుగుణంగా, ఏపీ, తెలంగాణాలోని మా వినియోగదారులందరికీ మా అత్యున్నత, ఆధునీకరించిన నెట్‌వర్క్‌ అనుభవాలను రెండు రెట్ల వేగంతో 'వి' గిగానెట్‌పై ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాము. గత సంవత్సర కాలంగా మేము మా కవరేజీ విస్తరించేందుకు పలు కార్యక్రమాలు ప్రారంభించాము. అందుబాటులోని ప్లాన్స్‌‌ను 'వి' వినియోగదారులు ఎంచుకోవడం ద్వారా 'వి' నెట్‌వర్క్‌పై మరింతగా మెరుగైన అనుభవాలను పొందవచ్చు' అని అన్నారు.



Next Story

Most Viewed