ట్విట్టర్‌లో మొట్టమొదటి ఎడిటెడ్ ట్వీట్..

by Dishafeatures2 |
ట్విట్టర్‌లో మొట్టమొదటి ఎడిటెడ్ ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్‌లలో ట్విట్టర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకుంటుంటారు. కానీ ట్విట్టర్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఎడిట్ ఆప్షన్ లేకపోవడం. ఈ ఆప్షన్ లేకపోవడంతో ట్విట్టర్లో ప్రతి ట్వీట్‌ పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అయితే తాజాగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ట్విట్టర్ చెక్ చెప్పింది.

ఆదివారం ట్విట్టర్ మొట్టమొదటి ఎడిటెడ్ ట్వీట్‌ను పబ్లిష్ చేసింది. అంతేకాకుండా ట్వీట్ ఎడిటెడ్ అన్న విషయం పబ్లిక్‌గా కనిపిస్తుంది. ఈ ట్వీట్ ద్వారా సంస్థ ఈ ఫ్యూచర్ రోల్ ఔట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తోంది. ఈ ఫ్యూచర్‌ను పరీక్షిస్తూనే ఈ ట్వీట్‌ను ట్విట్టర్ అధికారిక మంత్లీ సర్వీస్ సబ్‌స్రిప్షన్ సేవల అకౌంట్ ట్విట్టర్ బ్లూలో షేర్ చేసింది.

ఈ ఫ్యూచర్ ఎడిటెడ్ ఐకన్, టైమ్‌స్టాంప్, ఒరిజినల్ ట్వీట్ ఎడిట్ చేయబడిందని చూపించే లేబిల్ ఉంటుంది. ఈ మేరకు ట్విట్టర్ అధికార అకౌంట్లో 'హెలో.. ఇది ఎడిట్ బటన్ పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు. ఈ ఫ్యూచర్ ఎలా పనిచేస్తుందో మేము చెప్తాం' అని ట్వీట్‌లో సంస్థ రాసుకొచ్చింది.


Next Story

Most Viewed