ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. కొంచెం లేట్ అయిన మరణించే ఛాన్స్

by Disha Web Desk 17 |
ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. కొంచెం లేట్ అయిన మరణించే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ వాచ్ కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకుంటున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో తరుచుగా వినిపిస్తున్నాయి. ఒక వారం క్రితం కూడా ముగ్గురి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్, ఇప్పుడు మళ్లీ ఇంకొకరి ప్రాణాలను కాపాడింది. అదేలాగంటే, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక వ్యక్తి అలసిపోయి నిద్రలో ఉన్నప్పుడు తాను ధరించిన 'యాపిల్ వాచ్ 7' అధిక పల్స్ రేటు గురించి చాలాసార్లు అలెర్ట్‌ చేసి తన ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని డిజిటల్‌మోఫో అనే పేరుతో ఉన్న ఒకరు పోస్ట్ చేశారు.

అతను నిద్రలో ఉన్నప్పుడు తన పల్స్ రేటు గురించి తాను ధరించిన వాచ్ చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయితే అతను DND మోడ్‌ను ఎనేబుల్‌ చేయడంతో ఎటువంటి సౌండ్ నోటిఫికేషన్ రాలేదు. నిద్ర లేచిన తరువాత 10 అలెర్ట్స్‌ రావడంతో దీనికి పని లేదా ఒత్తిడి కారణమని భావించి, రోజంతా రెస్ట్ తీసుకున్నాడు. అయితే ఇంకా అలెర్ట్స్ ఆగకపోవడంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. వాచ్‌లో వచ్చిన అలర్ట్స్‌ తాలుకు పల్స్ రేటు, ఆక్సిజన్‌ లెవల్స్‌ వివరాలను డాక్టర్‌కు ఆన్‌లైన్‌లో చూపించడంతో వెంటనే డాక్టర్ అంబులెన్స్‌కు కాల్ చేసి ఆసుపత్రికి తరలించాడు.

ఆ తరువాత హాస్పటల్‌లో అతనిని టెస్ట్ చేసిన డాక్టర్లు అతని హిమోగ్లోబిన్ రేటు 3 g/dLకి పడిపోయిందని పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ స్థాయి 5.0 g/dl కంటే తక్కువగా ఉంటే ప్రమాదకరం. దీని కారణంగా మరణం సంభవించవచ్చు. మొదట్లో గుండెపోటు అని భావించినప్పటికీ తరువాత అతని జీర్ణవ్యవస్థలో రక్తస్రావం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో అతను ధరించిన యాపిల్ వాచ్‌ 7 నుండి అలర్ట్స్ వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు.

దీంతో పరిస్థితి క్రిటికల్ కాకుండా వెంటనే డాక్టర్లు వైద్యం మొదలు పెట్టి అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఒకవేళ అతను టైంకి మేల్కొనకపోయి ఉంటే నిద్రలోనే మరణం సంభవించి ఉండేదని వైద్యులు తెలిపారు. యాపిల్‌ వాచ్ సిరీస్ 7 కారణంగా అతను తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

యాపిల్‌ వాచ్ సిరీస్ 7లో హెల్త్‌కు సంబంధించిన చాలా ఫీచర్లు ఉన్నాయి. పల్స్ రేటును ట్రాక్ చేయడానికి ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ను అందించారు. అలాగే, హార్ట్ మానిటరింగ్ సిస్టమ్, SpO2 ఆక్సిజన్ లెవల్స్‌ మొదలగువాటిని ఈ వాచ్ నిరంతరం ట్రాక్‌ చేస్తూ ఉంటుంది, ఏదైనా ప్రమాదం అనిపిస్తే నోటిఫికేషన్‌ల ద్వారా అలర్ట్ చేస్తుంది.

Next Story

Most Viewed