ఇకపై చిన్న పిల్లలు, టీనేజర్లకు ఆ కంటెంట్ బంద్: మెటా

by Disha Web Desk 17 |
ఇకపై చిన్న పిల్లలు, టీనేజర్లకు ఆ కంటెంట్ బంద్: మెటా
X

దిశ, టెక్నాలజీ: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, యుక్త వయస్సుల వారిపై ప్రభావం చూపే హానికరమైన కంటెంట్లు చాలా వస్తున్నాయి. అయితే దీనిని కట్టడి చేయడానికి మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లకు ఆత్మహత్య, స్వీయ-హాని, ఇతర హానికమైర కంటెంట్‌/పోస్ట్‌లను వారి Instagram, Facebook అకౌంట్లలో కనపడకుండా చేస్తామని మెటా యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. మా యాప్‌లలో యుక్తవయస్కులు, చిన్న పిల్లలు వారి వయసుకు తగ్గ కంటెంట్‌ను మాత్రమే పొందాలని చూస్తున్నాము. వారిపై చెడు ప్రభావం చూపే పోస్ట్‌లు ఇతర కంటెంట్‌లను వారి ఖాతాల్లో అనుమతించమని సోషల్ మీడియా దిగ్గజం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్ లేదా Facebookకి కొత్తగా సైన్ అప్ అయినప్పుడు వయస్సును నమోదు చేసే సమయంలో నిజ సమాచారాన్ని ఎంటర్ చేయాలి. దీని వలన వారి ఖాతాల్లో హానికరమైన కంటెంట్‌ను చూడటానికి వీలుండదు. ఇటీవల అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే పోస్టులు యువత, చిన్న పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉంటున్నాయని ఆరోపణలు రావడంతో మెటా యాజమాన్యం తాజాగా ఈ చర్యలు తీసుకుంది.


Next Story

Most Viewed