- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అదిరిపోయే సౌండ్ క్వాలిటీతో సోనీ ఇయర్‌బడ్స్
దిశ, వెబ్‌డెస్క్: సోనీ కంపెనీ ఇండియాలో త్వరలో కొత్త ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు ‘సోనీ WF-1000XM5’. సెప్టెంబర్ 27న భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. గతంలో అమెరికాలో విడుదలవగా అక్కడ రూ.24,900 కు అందుబాటులో ఉంది. ఇండియాలో అంతకన్నా తక్కువ ధరలో లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇయర్‌బడ్స్ అత్యుత్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. దీనిలో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V2 చిప్‌తో పాటు, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం QN2e ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 8.4mm డైనమిక్ డ్రైవర్ Xని కలిగి ఉంది.
ప్రతి ఇయర్‌బడ్‌లో బోన్ కండక్షన్ సెన్సార్‌లు అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా కాల్ మాట్లాడే సమయంలో కాల్స్ నాణ్యత మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది. వాయిస్ అసిస్టెంట్ Google లేదా Alexa సపోర్ట్ ఉంటుంది. చార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను అందించారు. అలాగే Qi చార్జర్‌ని ఉపయోగించి వైర్‌లెస్‌గా కూడా చార్జ్ చేయవచ్చు. ఇయర్‌బడ్స్ ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటల నుంచి 12 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంటుంది. ఇది దుమ్ము, ధూళి కోసం IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది.