iPhone 16లో అప్‌గ్రేడెడ్ ‘Siri’..!

by Harish |
iPhone 16లో అప్‌గ్రేడెడ్ ‘Siri’..!
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ నుంచి త్వరలో విడుదల కాబోతున్న iPhone 16లో కొత్త టెక్నాలజీలను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఫీచర్లకు అదనంగా మరిన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, iPhone 16లో అప్‌గ్రేడ్ మైక్రోఫోన్‌‌‌ను ఉపయోగించనున్నారు. దీంతో వాయిస్ అసిస్టెంట్ సిరి మరింత మెరుగ్గా పనిచేస్తుందని, దీనికోసం సిరిని అప్‌గ్రేడ్ చేయనున్నట్లు TF సెక్యూరిటీస్ ఇంటర్నేషనల్ అనలిస్ట్ మింగ్-చి కువో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, iOS ఆపరేటింగ్ సిస్టమ్‌కు AIని అందించాలని చూస్తున్నారు. దీంతో Apple Siriకి మరిన్ని అప్‌గ్రేడ్‌లు లభించనున్నాయి.

మైక్రోఫోన్‌ సిగ్నల్-టు-నాయిస్ రేషియో (SNR) ను మరింత డెవలప్ చేస్తున్నారు. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌‌ని తగ్గిస్తుంది. సిరిని మరింత డెవలప్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-జెనరేటెడ్ కంటెంట్ (AIGC)తో పనిచేయడానికి నిపుణుల బృందం సిద్ధంగా ఉందని సమాచారం. అయితే అప్‌గ్రేడ్ చేసిన మైక్రోఫోన్ టెక్నాలజీని సిరికి యాడ్ చేయడం ఖర్చుతో కూడకున్నది. పాత వాటితో పోలిస్తే కొత్త దానికి దాదాపు ఖర్చుల భారం 100 శాతం పెరుగుతుందని మింగ్-చి కువో అన్నారు.



Next Story

Most Viewed