కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2 వేల తగ్గింపు ఆఫర్

by Dishanational1 |
కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2 వేల తగ్గింపు ఆఫర్
X

దిశ, టెక్నాలజీ: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ05ఎస్ మోడల్‌పై రూ. 2,000 తగ్గింపును ప్రకటించింది. 4జీబీ, 6జీబీ ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ధరను సవరించిన తర్వాత దీని ప్రారంభ ధర రూ. 11,499కే లభించనుంది. 6జీబీ వేరియంట్ ధర తగ్గింపు తర్వాత రూ. 12,999కి అందుబాటులో ఉంది. కంపెనీ అందిస్తున్న తగ్గింపు ఆఫర్ శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఎంపిక చేసిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో లేత వయలెట్, నలుపు రంగుల్లో లభిస్తుంది. 6.71 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, వెనుక 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 2ఎంపీ డెప్త్, 2ఎంపీ మైక్రో కెమెరా, ముందువైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగినఈ ఫోన్‌ 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, రెండు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Next Story

Most Viewed