త్వరలో మార్కెట్లోకి రాబోతున్న Realme Coca-Cola స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
త్వరలో మార్కెట్లోకి రాబోతున్న Realme Coca-Cola స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ కంపెనీ Realme నుంచి కొత్త మోడల్ Coca-Cola స్పెషల్ ఎడిషన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఈ ఫోన్ గురించిన పూర్తి ఫీచర్లను ఇంకా వెల్లడించలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం ఇది Realme 10 4G కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా పేర్కొంటున్నారు. ఈ ఫోన్ ఫీచర్లే కొత్త Coca-Cola స్పెషల్ ఎడిషన్‌లో ఉండే అవకాశం ఉందని సమాచారం.


ఇంతకుముందు విడుదలైన Realme 10 4G లో 6.5-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, MediaTek Helio G99 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12-ఆధారిత Realme UIతో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 16MP కెమెరా, 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇవే ఫీచర్లు కూడా Coca-Cola స్పెషల్ ఎడిషన్‌లో ఉండే అవకాశం ఉంది. కానీ వీటిని అధికారికంగా నిర్ధారించలేదు. లాంచ్ టైంలో అన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించనుంది.


Next Story

Most Viewed