ఇండియాలోకి Realme 11 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు.. ఎప్పుడంటే..!?

by Disha Web Desk 17 |
ఇండియాలోకి Realme 11 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు.. ఎప్పుడంటే..!?
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Realme కొద్ది రోజుల క్రితం చైనాలో Realme 11 సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇదే మోడల్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది. నివేదికల ప్రకారం, రియల్‌మీ 11 ప్రో సిరీస్ జూన్ 2023లో భారత్‌లోకి రానుంది. ఇదే సిరిస్‌లో Realme 11 Pro, Realme 11 Pro + వేరియంట్లు రానున్నాయి. ఈ మోడల్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13 ద్వారా రన్ అవుతాయి.
Realme 11 Pro ఫోన్ 6.7-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లేను, MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్ 108MP + 2MP, ముందు కెమెరా 16MP. బ్యాటరీ విషయానికి వస్తే, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీ ఉంది.
Realme 11 Pro + మోడల్ MediaTek Dimensity 7050 ప్రాసెసర్‌తో, 6.7-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్ 200MP + 8MP + 2MP, ముందు కెమెరా 32MP. 100W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 mAh కెపాసిటీ బ్యాటరీని అందించారు.
Next Story