కర్వ్డ్ డిస్‌ప్లే‌‌తో Realme స్మార్ట్ ఫోన్.. ఇండియాలో లాంచ్ తేదీ ఇదే!

by Disha Web Desk 17 |
కర్వ్డ్ డిస్‌ప్లే‌‌తో Realme స్మార్ట్ ఫోన్.. ఇండియాలో లాంచ్ తేదీ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Realme కొత్తగా '10 Pro 5G, 10 Pro+ 5G వేరియంట్లను డిసెంబర్ 8న ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంతకుముందు చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు లాంచ్ టైం లో తెలుస్తాయి. డిసెంబర్ 8 న మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఫోన్లు అమ్మకానికి వస్తాయి.


స్పెసిఫికేషన్లు(అంచనా)

రెండు వేరియంట్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. Realme 10 Pro+ 5G మోడల్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 1080 SoC ద్వారా పనిచేస్తుంది. అదే 10 Pro 5G స్నాప్‌డ్రాగన్ 695 5G SoCని కలిగి ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు Android 13లో Realme UI 4తో రన్ అవుతాయి.Realme 10 Pro+ 5G 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అదే 10 Pro 5G మోడల్ 108MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ స్నాపర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్లకు కూడా ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా, అలాగే, 5,000mAh బ్యాటరీ ఉంది. వీటి బేస్ వేరియంట్ ధరలు దాదాపు రూ. 18,000 ఉండే అవకాశం ఉంది.

Next Story