ఆఫర్ల ద్వారా కేవలం 5 వేల రూపాయలకే నథింగ్ ఫోన్ (1)

by Disha Web Desk 17 |
ఆఫర్ల ద్వారా కేవలం 5 వేల రూపాయలకే నథింగ్ ఫోన్ (1)
X

దిశ, వెబ్‌డెస్క్: వెరైటీ డిజైన్, ప్రత్యేకమైన OSను కలిగిన నథింగ్ ఫోన్ (1) వినియోగదారులకు తక్కువ ధరలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్‌లు అయినటువంటి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేమైన తగ్గింపులతో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో, నథింగ్ ఫోన్ (1) ప్రారంభ ధర రూ. 28,899. కానీ వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను మార్చుకుంటే రూ. 25,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన వివిధ రకాలైన బ్యాంకు కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి.


అదే ఫ్లిప్‌కార్ట్‌లో, నథింగ్ ఫోన్ (1) బేస్ ధర రూ. 26,749. ఎక్స్చేంజ్ ఆఫర్ ధర రూ. 21,400 తగ్గింపు ఉంది. కొనుగోలు టైంలో కూడా వివిధ బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. అన్ని ఆఫర్ల ద్వారా స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 5,000 కంటే తక్కువకే లభిస్తుంది.




నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌లు

ఇది 6.55-అంగుళాల పూర్తి-HD+ OLED ప్యానెల్‌తో వస్తుంది. నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ 12-ఆధారిత నథింగ్ OS ద్వారా రన్ అవుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP కెమెరా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.


Next Story

Most Viewed