ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యవస్థాపకుడిపై నెటిజన్ల ట్రోలింగ్స్

by Disha Web Desk 22 |
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యవస్థాపకుడిపై నెటిజన్ల ట్రోలింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య తరచూ ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్ని ప్రమాదానికి గురవడం చూస్తున్నాం. దీంతో ఈ వాహనాలపై వినియోగదారులలో పూర్తి అపనమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌కు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

'ఓలా ఎస్1 ఇ-స్కూటర్లతో ఇంకేమైనా కావాలనుకుంటున్నారా? అని భవీశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు విరుచుకు పడ్డారు. కొందరు ఎగతాలి చేస్తూ.. స్కూటర్ స్టాండ్, స్కూటర్ కవర్లు కావాలంటూ వ్యంగ్యాస్త్ర కామెంట్లు చేయగా.. మరికొందరు తీవ్రంగా మండిపడ్డారు. స్కూటర్ అగ్నిప్రమాదానికి గురవుతున్న సమస్యను తెలియజేస్తూ.. 'మంటలు ఆర్పేందుకు రక్షణగా కొన్ని పరికరాలు కావాలి'అని, 'ఇ-స్కూటర్లతో భద్రత కావాలని' పలువురు కామెంట్ల బాక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story