మళ్లీ మూన్ లాంచ్‌ వాయిదా.. కారణం ఏంటంటే..

by Dishafeatures2 |
మళ్లీ మూన్ లాంచ్‌ వాయిదా.. కారణం ఏంటంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా కాలం తర్వాత చంద్రుడిపైకి వెళ్లేందుకు సానా సిద్ధమైంది. మూన్ మిషన్ రాకెట్‌ను మంగళవారం లాంచ్ చేసేందుకు సన్నద్ధమైంది. అయితే తాజాగా మంగళవారం జరగాల్సిన ఈ లాంచ్‌ను వాయిదావేస్తున్నట్లు నాసా వెల్లడించింది. ఇందుకు రానున్న తుఫాను కారణంగా నాసా తెలిపింది. ఫ్లోరిడా చేరుకునే సరికి ఈ తుఫాను బలం పుంజకుంటుందని, ఆ కారణంగానే మిషన్ మూన్‌ను వాయిదా వేస్తున్నామని నాసా తెలిపింది.

అయితే ఈ మిషన్ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా వచ్చిన విపరీత వాతావరణ పరిస్థితి కారణంగా మిషన్ మూన్ వాయిదా పడటంతో ఆర్టెమిస్ 1ను తిరిగి దాని అసెంబ్లీ ప్రదేశానికి పంపుతున్నట్లు నాసా తెలిపింది. 'నాసా తన ప్రయోగ అవకాశాన్ని వాయిదా వేసుకుంది. లాంచ్ ప్యాడ్ నుంచి వెనక్కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఉష్ణమండల తుఫాను ఇయాన్‌కు సంబంధించిన వాతావరణ సూచనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది' అని సంస్థ తెలిపింది.

చాలా కాలం ఆలస్యం, ఖర్చుల తర్వాత ఆర్టిమిస్ 1 మిషన్ విజయం నాసాకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ నాసాకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే రెండు సార్లు రాకెట్ టెక్నికల్ సమస్యల కారణంగా లాంచ్ వాయిదా పడింది. వాటిలో ఒకటి ఫ్యూయల్ లీక్ కూడా ఉంది. ఇప్పుడు ఆర్టిమిస్ 1 లాంచ్‌కు వాతావరణం అడ్డుతగలడం నాసాకు తీవ్ర నిరాశ మిగిల్చింది. మరి ఆర్టిమిస్ 1 లాంచ్‌కు నాలుగో ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.


Next Story