50MP కెమెరాతో Lava కొత్త వేరియంట్ విడుదల

by Disha Web Desk 17 |
50MP కెమెరాతో Lava కొత్త వేరియంట్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కంపెనీ Lava కొత్తగా ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. పండగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకొడానికి "Lava Blaze Pro"ని బ్లేజ్ సిరీస్‌లో విడుదల చేసింది. ఇది 4GB RAM 64GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 10,499. లావా అధికారిక వెబ్‌సైట్, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌ల నుండి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌లో భాగంగా రూ. 9,999కే ఫోన్ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ గ్లాస్ గోల్డ్, గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ, గ్లాస్ ఆరెంజ్ కలర్స్‌లలో అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ ప్రో కొనుగోలుపై 100-రోజుల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ కూడా లభిస్తుంది.


Lava Blaze Pro స్పెసిఫికేషన్స్

* 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5″ HD+ LCD డిస్‌ప్లే.

* ఫోన్ బ్యాక్‌ సైడ్ ఫ్రాస్టెడ్ గ్లాస్‌ను కలిగి ఉంది.

* Helio G37 SoC ద్వారా పనిచేస్తుంది.

* స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 తో రన్ అవుతుంది.

* మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 256GB వరకు పెంచుకోవచ్చు.

* ర్యామ్‌ను వర్చువల్‌గా 7GB వరకు పెంచుకోవచ్చు.

* ఫోన్ బ్యాక్ సైడ్ 50 MP+ 2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు వైపు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.

* 10W ఛార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీని అందిస్తుంది.

* ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.





Next Story

Most Viewed