కారుపై గీతలు పడ్డాయా.. ఇక వాటంతట అవే మాయం అవుతాయట

by Dishaweb |
కారుపై గీతలు పడ్డాయా.. ఇక వాటంతట అవే మాయం అవుతాయట
X

దిశ, వెబ్‌డెస్క్ : డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ,ఇంట్లో నుండి కారు తీసేటప్పుడు కానీ ,కారును ఏ గోడకు స్తంభానికో ఢీకొట్టడం వల్ల గీతాలు పడడం సహజం.అవి పోవాలంటే మళ్ళీ షోరూం కి తీసుకెళ్లి పెయింటింగ్ లేదా స్ప్రే చేయించాలి. ఇప్పుడా బాధ లేకుండా కేవలం 30 నిమిషాల పాటు ఎండకి ఉంచితే ఆ గీతలు వాటి అంతటావే చెరిగిపోయే కోటింగ్ని కొరియన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ కొత్త రకం పూతలో ఆకలి పాలియోల్ అనే పాలిమర్లు ఉంటాయట.

రసాయన బంధంతో ముడిపడిన ఈ పాలిమర్లు అవసరమైనప్పుడు బంధాల నుంచి విడివడి మళ్లీ అంతే సులభంగా కలుసుకుంటాయి. అంటే కారుకు వేసిన పెయింటింగ్ లోని పాలిమర్లన్నీ గీతలు పడినప్పుడు తమ అమెరికను సరిచేసుకుని మళ్లీ కలిసిపోతాయి దాంతో గీత కనిపించదు. దీనికి చేయాల్సిందల్లా కారుని మిట్టమధ్యాహ్నం ఎండకి లేదా వేడికి గురి చేయడమేనట. అలా చేయగానే కోటింగ్ లో వాడిన ఫోటో థర్మల్ రంగులోని అణువులు పరారుణ కాంతిని గ్రహించి తమ అమరికని సరి చేసుకుంటాయి. అరగంట చాలా ఎక్కువ సమయం అనుకుంటే భూతద్దం పెట్టి కాంతి నేరుగా గీతలు ఉన్నచోట పడేలా చేస్తే కేవలం అరక్షణం లోనే అవి పోతాయట. ప్రస్తుతం వాడుకలో ఉన్న అకర్బన పెయింటింగుల కన్నా ఈ కొత్త కార్బన్ ఫోటో థర్మల్ రంగు సమర్థంగా పనిచేస్తుంది దీనికి పట్టే శక్తి సమయం కూడా తక్కువే అదే మిగిలిన వాటికి ఎక్కువ సమయంతో పాటు హిట్ గన్స్ లేదా కాన్సెంట్రేటెడ్ యు విల్ లైట్లు అవసరం అవుతాయట.Next Story