ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను సురక్షితంగా ఎలా ఉంచాలంటే..?

by Disha Web |
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను సురక్షితంగా ఎలా ఉంచాలంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానో దోహదపడుతాయి. అయితే ఇటీవల కాలంలో EV లు పలు సమస్యల కారణంగా మంటలు రావడం. బ్యాటరీలు పేలడం వంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. దీని వలన కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారు..అలాగే ఇప్పటికే కొన్న వారు తమ వాహనంపై భయంతో కాలం వెల్లదీస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన తమ వాహనాలు కాలిపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

EVల బ్యాటరీ పేలకుండా ఉండాలంటే జాగ్రత్తలు..

  • ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మీ వాహనాన్ని ఉంచకండి..
  • ఎండలో మీ వాహనాలు పార్క్ చేయవద్దు..
  • నిర్ధేశించిన చార్జ్ ను మాత్రమే ఉపయోగించాలి..
  • వాహనాలు ఉపయోగించిన గంట తర్వాత ఛార్జింగ్ పెట్టాలి..
  • బ్యాటరీ లో ఎప్పటికప్పుడు పరిశీలించి.. ఎదైన సమస్య ఉంటే వెంటనే.. తయారీ దారులకు తెలియజేయండి..
  • ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ కు దూరంగా ఉండండి. దీని వలన వాహనం యొక్క బ్యాటరీ దెబ్బతింటుంది. అలాగే అగ్ని ప్రమాదానికి కారణం అవుతుంది.
  • అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి అత్యవసర సేవలకు కాల్ చేయండి.. ఎట్టి పరిస్థితుల్లో మీరే మంటలను ఆర్పే ప్రయత్నం చేయండి.
Next Story

Most Viewed