200MP కెమెరా గల ‘హానర్ 90 5G’ పై రూ.10 వేల తగ్గింపు

by Disha Web Desk 17 |
200MP కెమెరా గల ‘హానర్ 90 5G’ పై రూ.10 వేల తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హానర్ కంపెనీ ఇండియాలో ‘హానర్ 90 5G’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM+256GB స్టోరేజ్ ధర రూ.37,999. 12GB RAM+512GB స్టోరేజ్ ధర రూ.39,999. అయితే కొనుగోలు సమయంలో ప్రత్యేకమైన ఆఫర్ల ద్వారా ఈ ఫోన్‌ను రూ.10 వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18 నుండి అమెజాన్, ఇతర సైట్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

హానర్ 90 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ డిస్‌ప్లేతో, 2664×1200 రిజల్యూషన్, 100 శాతం DCI P3 కలర్, 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్‌ను అందిస్తుంది. దీనిలో 200MP ప్రధాన కెమెరా, 12 MP అల్ట్రా-వైడ్, 2MP డెప్త్ కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 50 MP కెమెరాను కలిగి ఉంది. ఇది Android 13 ఆధారిత MagicOS 7.1పై రన్ అవుతుంది. దీనిలో 5000mAh బ్యాటరీ అందించారు. ఒక్కసారి చార్జింగ్‌తో 19.5 గంటలు నిరంతరాయంగా వీడియోలను చూడవచ్చని కంపెనీ పేర్కొంది.


Next Story

Most Viewed