వారి కోసం గూగుల్ బార్డ్ AI చాట్‌బాట్‌‌లో కొత్త ఫీచర్స్

by Disha Web Desk 17 |
వారి కోసం గూగుల్ బార్డ్ AI చాట్‌బాట్‌‌లో కొత్త ఫీచర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల AI చాట్‌బాట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. టెక్ కంపెనీలు అన్ని కూడా స్వంతంగా చాట్‌బాట్‌లను తయారు చేస్తూ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా OpenAI ChatGPT విడుదలైన తర్వాత ఈ విభాగంలో మరిన్ని ఎక్కువ సంఖ్యలో AI బాట్‌లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గూగుల్ కూడా బార్డ్ అనే AI చాట్‌బాట్‌ను విడుదల చేసింది. మొదట్లో అమెరికా,UK లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు మిగతా దేశాలకు సైతం విస్తరిస్తుంది.

మేలో కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన Google వార్షిక I/O సమావేశంలో ఇండియాతో సహా 180 దేశాలు AI- చాట్‌బాట్ బార్డ్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన బార్డ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, ఏరియాను బట్టి లోకల్ ఫీచర్లను అందిస్తుంది. తాజాగా యువత/విద్యార్థుల కోసం ఉపయోగపడేలా కొత్త ఆప్షన్లను దీనిలో అందించారు. విద్యార్థులకు సైన్స్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సలహాలు, పాఠశాలలు, కాలేజ్ స్టూడెంట్స్ కోసం వారి సబ్జెక్టుల అంశాలు, మ్యాథ్స్, సైన్స్, క్లిష్టమైన ప్రాబ్లమ్స్‌కు ఆన్సర్స్ ఈజీగా తెలుసుకునేలా బార్డ్‌ను విద్యార్థుల కోసం అప్‌డేట్ చేశారు.

మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ సమీకరణాలను టైప్ చేయడం లేదా ఫొటో ద్వారా అప్‌లోడ్ చేసి సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవచ్చు. ఈ సమస్యలను విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా చార్ట్‌లు, పట్టికల రూపంలో ఉంటాయి. వీటితో పాటు అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన సూచనలు కూడా పొందవచ్చు. అలాగే, కొత్త టెక్నాలజీని నేర్చుకునే పలు అంశాలు కూడా బార్డ్‌లో లభిస్తాయిని కంపెనీ పేర్కొంది.

Next Story