ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ చేసే Fire-Boltt కొత్త స్మార్ట్‌వాచ్

by Harish |
ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ చేసే Fire-Boltt కొత్త స్మార్ట్‌వాచ్
X

దిశ, టెక్నాలజీ: స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ ఫైర్-బోల్ట్ కొత్త మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు ‘ఫైర్-బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్(Fire-Boltt Dream wristphone)’. ధర రూ. 5,999. ఇది ఆక్వా సర్జ్, చెర్రీ హగ్, కోరల్ బ్రీజ్, ఫారెస్ట్ ఫ్రింజ్, ఫ్యూజన్ ఫ్లికర్ కలర్స్‌లలో లభిస్తుంది. మరిన్ని వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. అవి కోకో కోచర్, మిడ్‌నైట్ గ్రేస్ లెదర్ స్ట్రాప్ ధర రూ.6,299. ఐరీష్ గ్లామ్, మిడ్‌నైట్ స్టీల్, స్కై సిజిల్ ధర రూ.6,499. కంపెనీ రిటైల్ స్టోర్లు, ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా కొనుగోలుకు ఉంది.


ఫైర్-బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్ స్పెషిఫికేషన్స్:

ఈ స్మార్ట్‌వాచ్ 2.02-అంగుళాల (320 x 386 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 60Hz. గరిష్ట బ్రైట్‌నెస్ 600 నిట్‌ల వరకు ఉంది. ఇది Mali T820 MP1 జీపీయూ క్వాడ్-కోర్ ఆర్మ్ కార్టెక్స్-A7 MP చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 8.1తో ఇన్‌బిల్ట్‌గా రన్ అవుతుంది. యూజర్లు తమ హెల్త్‌ను చెక్ చేసుకోడానికి హృదయ స్పందన రేటు, SpO2, క్యాలరీ మానిటర్‌, ఫిట్‌నెస్ ట్రాకింగ్ వంటి వాటిని అందించారు.

అలాగే స్మార్ట్‌వాచ్‌లో జీమెయిల్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, జోమాటో, Spotify, Myntra, వంటి అప్లికేషన్లను వాడుకోవచ్చు. జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వీడియో OTT ప్లాట్‌ఫారమ్‌ల వీడియోలను కూడా దీనిలో చూడవచ్చు. డిస్‌ప్లే సైజు చిన్నగా ఉన్నప్పటికి వీడియోలను అత్యంత నాణ్యతతో చూడవచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే, సబ్‌వే సర్ఫర్‌లు, టెంపుల్ రన్, క్యాండీ క్రష్ వంటి గేమ్‌లను కూడా ఆడుకోవచ్చు.

4G LTE కనెక్టివిటీ, Wi-Fi, బ్లూటూత్, GPS సపోర్ట్ ఆప్షన్లను అందించారు. బ్లూటూత్ కాలింగ్ ద్వారా వాచ్ నుంచే నేరుగా కాల్స్‌కు ఆన్సర్ చేయవచ్చు. దీనిలో 800mAh బ్యాటరీని అమర్చారు. 36 గంటల స్టాండ్‌బై టైం వస్తుందని, అలాగే ఎక్కువగా వాడినట్లయితే 4 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇది దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉంది.

Next Story

Most Viewed