వాట్సాప్ 2022 డిసెంబర్ నెలలో ఎన్ని ఖాతాలను నిషేధించిందో తెలుసా..!

by Disha Web Desk 17 |
వాట్సాప్ 2022 డిసెంబర్ నెలలో ఎన్ని ఖాతాలను నిషేధించిందో తెలుసా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతదేశంలో 2022 డిసెంబర్ 1-31 మధ్య కాలంలో 36.77 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. గత నెలలో(నవంబర్) నిషేధించిన ఖాతాల సంఖ్య కంటే ఇది చాలా తక్కువ. నవంబర్‌లో, వాట్సాప్ దేశవ్యాప్తంగా 37.16 లక్షల ఖాతాలను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 క్రింద మంత్లీ రిపోర్ట్‌లో భాగంగా వాట్సాప్ యాజమాన్యం ప్రతినెలా ఖాతాల నిషేధం, ఫిర్యాదుల వివరాలు, తీసుకున్న చర్యలను ప్రకటిస్తుంది. డిసెంబర్‌లో ఫిర్యాదులు దాదాపు 70 శాతం పెరిగి 1607కి చేరుకున్నాయి, వీటిలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ సంస్థ 166 అప్పీళ్లపై మాత్రమే చర్య తీసుకుంది. 1,459 నివేదికలు అప్పీల్ కోసం, మిగిలినవి భద్రత వంటి ఇతర కేటగిరీల కింద ఉన్నాయి. గత నవంబర్‌లో 946 ఫిర్యాదులు రాగా, వాటిలో 74పై చర్య తీసుకుంది.



Next Story