- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఇండియాలోకి ChatGPT టెక్నాలజీతో మొట్టమొదటి స్మార్ట్‌వాచ్

దిశ, వెబ్‌డెస్క్: ChatGPT టెక్నాలజీతో ఇండియాలో మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ విడుదలైంది. దీని పేరు ‘క్రాస్‌బీట్స్ నెక్సస్(Crossbeats Nexus)’. ధర రూ.5,999. గత నెలలో లాంచ్ కాగా, ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉంది. ఇది సిల్వర్, బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. ముందస్తు బుకింగ్ చేసిన వారికి పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఈ వాచ్ Android, iOS ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది.
ఇది 320 x 384 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 2.1-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ముఖ్యంగా 500కి పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వాచ్ నుంచి నేరుగా కాల్స్ చేయవచ్చు, అలాగే ఆన్సర్ చేయవచ్చు.
వాచ్‌లో GPS డైనమిక్ రూట్ ట్రాకింగ్, చదువుకోడానికి ఈబుక్ రీడర్, అల్టీమీటర్, బేరోమీటర్, దిక్సూచి, హార్ట్ రేట్ ట్రాకర్, SpO2 లెవెల్స్ మానిటర్, స్లీప్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ వాచ్ iOS 10, ఆండ్రాయిడ్ 5.1 అంతకంటే ఎక్కువ వెర్షన్‌లకు అనుకూలంగా ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.